గుండె గొంతుతో కొట్లాడుతుంది....మాట అన్నది పలకనన్నది... ఊసులేవి చెప్పనన్నది, ఒంటరిగానే ఉంటానంటూ, తన వ్యధనేమో దాచిపెట్టి కంటి తడి బానిసను కానంటు మొండికేసి, మోకాళ్ళపై తలవంచి ఆలోచనలు కుప్పపోసి కోపంతో తగలెట్టి..విసురుగా సముద్రపుతీరం వైపు వడి వడిగా అడుగులేసి...అక్కడే కూర్చుండిపోయే..పిచ్చి మనసు ఓ చిన్ని మనసు.....మాటలేవీ వద్దే వద్దంటూ తెలిసిన అక్షరాలన్ని గులకరాళ్ళుగ చేసి సముద్రంలో విసిరేసింది..తనతో ఉన్న జ్ఞాపకాలన్నీ పిచుకగూళ్ళు చేసి చెరిపేసింది....దాగని కన్నీళ్ళను నీటి చెలమలో కలిపేసింది....
అపుడు నీకు నేనున్నానంటూ భుజంపై చేయి వేసి ఒకరు, నీ ఇష్టం నాకు కాక ఎవరికీ తెలుస్తుంది అని తలపై చేయి వేసి ఒకరు,నీకు కావలసింది అందించే నేను ఉన్నానుగా అంటూ ఒకరు...ఇందరు ఉన్నా పలకడానికి ఒక అక్షరం కూడా లేదు ఇపుడు....వారంతా నా వాళ్ళేకామోసు అని చెరిగిన పిచుకగూళ్ళ వైపు చూసింది. పకపకా నవ్వింది....పగలపడి నవ్వింది...ప్రశాంతంగా ఆగి ఆగి నవ్వింది... నా వ్యధ పంచకుండానే, నాకై ఎవరి సాయం కోరకుండానే, నా ఇష్టం తెలిసి నాకు అందించలేదేమని అడగకుండానే....నాకోసం ఇపుడు వచ్చావా అనకుండానే... నాకై నీ అరచేతిని అడ్డుపెట్టలేదేమని ఆర్దిచకుండానే హాయిగా నవ్వడం వచ్చేసింది.....నేను గెలిచేసానోచ్ అని గెంతులువేసింది ఉల్లాసంగా పిచ్చి మనసు..తర్కం తెలియని చిన్నపిల్లలా...