17, డిసెంబర్ 2011, శనివారం

పేస్ బుక్ ..శత్రువా..

పేస్ బుక్ వాడడం పైన చాలా విమర్శలు వస్తున్నాయి.. మానవ సంబంధాలని మెరుగుపర్చడం కోసం వచ్చిన పేస్ బుక్ ఎంత త్వరగా అందరినీ ఆకట్టుకుందో , అదే విధంగా ఇపుడు అందరితో వేలెత్తి చూపించుక్నే పరిస్థితి లోకి నెట్టబడుతుంది..నిజంగా ఈ సోషల్ నెట్వర్క్ సైట్ మానవ సంబంధాలని మలిన పరుస్తుందా..

చెడు చేయాలనుకున్నవారికి, నిజాయితీ లేని వారికి,ఎదుటి మనిషిని కించపరిచే ఉద్దేశ్యం ఉన్న వారికి పేస్ బుక్ లేకపోతె ఇంకొకటి ఆలంబనగా మారుతుంది.. ఇంకొందరు చెడు చెయ్యడం లేదు అంటూనే .. మంచినీటిలోని విషంలా...చెడు ని నలుగురికి అందించడంలో సహకారం అందిస్తారు..
మనలో మానవతా విలువలు (moral values) లోపించినపుడు,మన ఆలోచనా ప్రవృత్తిలో నిజాయితీ లేనపుడు ఈ సోషల్ నెట్వర్క్ దోహదం చేస్తుంది అని అనిపిస్తుంది, మనం చేసే పనులకు ఇంకొకరిని తప్పు పట్టడం మానవ సహజం, ఇపుడు కూడా అంతే...మనకు ఎపుడు వేరొకరిని వేలెత్తి చూపే అలవాటు ఉంది కనుక విచక్షణా రహితంగా ఈ  సైట్ పై విమర్సలు గుప్పిస్తున్నాం..

పేస్ బుక్(facebook) లో అడుగు పెట్టినపుడే తెలియాలి మనం ఒక డయాస్ మీద ఉన్నాము అని ..మనం ప్రతీ ఒక్కరిని చూసి మనం ఒక్కరిని ఒక్కోలా అనుకుంటాం ...అలానే ఎదుటివారు కూడా మన గురించి అనుకుంటారు..ఎవరికీ మీ గురించి పూర్తిగా తెలియదు..మీ పోస్ట్స్ కి మీరు అనుకున్న కామెంట్స్ రావాలని ఆశ పడి, ఎవరో తప్పుగా కామెంట్స్ చేసారని నిరాశకు గురికావడం, మీ పోస్ట్స్ ఎటువంటి పరిస్థితుల్లో పెట్టరో.. మీ పర్సనల్ లైఫ్ గురించి వివరణ ఇవ్వడం మన తప్పిదమే..మిమ్మలిని ఇబ్బంది పెట్టేవాళ్ళని నిరభ్యంతరంగా బ్లాక్ చెయ్యండి..అంతే కాని ఇంకోసారి ఇలా చేయకూఅంటూ మన్నిస్తూ అలా సమయం పెంచుకుంటూ పోకండి..ఇక పిలిచే పిలుపుల గురించి పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు...good night dear అంటూ కామెంట్ చేయడం చాల సహజం ఐపోయింది..కొంతకాలం పేస్ బుక్ తో స్నేహం చేస్తే మీకంటూ ఒక స్నేహితుల గ్రూప్ ఏర్పడుతుంది..

మంచి, చెడు అన్నది ప్రతీ దానిలోనూ ఉంటుంది..అంత అద్బుతమైన రహదారి ఐనా ప్రమాదాలు అన్నవి సహజం..అందుకు బాధ్యత ప్రమాదాలకు గురయ్యే మనదే అన్నది నిజం..మీరు పేస్ బుక్ వాడకుండా, దాని గురిచి ఏమి తెలుసుకోకుండానే మీ పిల్లలను అదుపులో పెట్టాలనే ఆలోచనతో విమర్సలు మాత్రం చేయకండి..

Read this article also...share your views ....
 
ఫేస్ బుక్ తో ఫ్రెండ్ షిప్ ఇలా...

12, డిసెంబర్ 2011, సోమవారం

ఇష్టం ఇబ్బంది పెడుతుంది......

ఇష్టం, ప్రేమ ఈ రెండు పదాలు నన్ను చాలా ఇరుకున పెడుతాయి ఎపుడు.....ఇష్టం అని ఎపుడు వాడాలో, ప్రేమా అని ఎపుడు వాడాలో, రెండు పదాలకు ఏమైనా తేడా ఉందా... ఒకదాని బదులు ఇంకోపదం  వాడితే ఏమి ముప్పు వస్తుందో  అని కూడా అనిపించక మానదు, ఇంగ్లీషులో ఇతే like,love కి పెద్ద తేడా అనిపించదు..ఇలాంటప్పుడే కొన్ని తెలుగు పదాలు వాడడం పూర్తిగా మానేస్తే పోదా అని,

ఇంతకుముందు  ఇల్లు, పొలాలు ఆస్థులు అవి ఎవరికో ఒకరికి సొంతం అని అనుకునేదాన్ని, కానీ మనుషులు ఎప్పటినుండి ఆస్తిగా మరిపోయారో తెలియనేలేదు.. ఇలాంటి ఆలోచనా ఊహా ఇంతకుముందు ఎపుడు ఉండేది కాదు, ఎందుకో ఎప్పుడు నా స్నేహితులే చాల గొప్పగా అనిపించేవారు..వాళ్ళు ఎవరి ఆస్తిగా పరిగణింపబడి నేను ఇబ్బంది పడింది కూడా లేదు, కానీ తరవాత ఎంతో మంది బంధువులు కావొచ్చు , తెలిసినపిల్లలు కావొచ్చు ఎన్ని సంవత్సరాలు ఉన్నా, నా దగ్గరే పెరిగినా కూడా వారిపై ఇష్టాన్ని మాటల్లో చేతల్లో చూపడం కూడా చేయకూడదు వాళ్ళంతా ఎవరికో చెందినా ఆస్తిగా మాత్రమే చూడాలి .. మనం వారిని మన ఇంటికి ఆహ్వానించాలి అంటే మన ఇంట్లో ఫంక్షన్ ఐనా ఉండాలి లేదా ఏదైనా బంధుత్వం ఉండాలని ఒక కొత్త రూల్ కూడా ఉంటుంది...వారంతా ప్రేమ బంధీలు కాబోలు..

ఎవరు ఎంత ఇబ్బందిబడినా ..ఎవరి రూల్స్ వారికీ ఉంటాయి, ఎవరి ఆస్తికి వారు కాపలా ఏర్పాటు చేసుకుంటారు, నా ఇష్టం నాతోనే ఉంటుంది, వ్యక్తులు మారుతూ ఉంటారు, నా ఇష్టం వారితో చెలిమి చేస్తూనే ఉంటుంది...జీవితం ఆశలతో, ఊహలతో ఆకాశానికి రహదారి వేస్తూ సాగుతూనే ఉంటుంది...అలోవోకగా తటిల్లున మెరిసే పెదవిపై చిరునవ్వులా...

ఇష్టం మీద ఇష్టంతో రాసిన  ఆర్టికల్ ....
ఇష్టం చాలా చిన్న పదం, కానీ ఆ పదం వెనుకు ఉన్న భావాలు అనంతం. ప్రతీ మనిషికి తనకు నచ్చింది చెప్పడానికి  వాడే పదం 'ఇష్టం'. మనలో చదువు సంస్కారం, అభివృద్ధి, ఆలోచనా పరిధి పెరిగే కొద్ది .. అభిమానము ఆప్యాయత,అనురాగం, ప్రేమ యిలా మనము వాడేపదాలు చాలా ఉంటాయి. పుట్టకతో వచ్చే చిరునవ్వులా ప్రతీ వారికి అనుభవంలోకి వచ్చే పదం 'ఇష్టం...'
for more click this link....