ఇష్టం, ప్రేమ ఈ రెండు పదాలు నన్ను చాలా ఇరుకున పెడుతాయి ఎపుడు.....ఇష్టం అని ఎపుడు వాడాలో, ప్రేమా అని ఎపుడు వాడాలో, రెండు పదాలకు ఏమైనా తేడా ఉందా... ఒకదాని బదులు ఇంకోపదం వాడితే ఏమి ముప్పు వస్తుందో అని కూడా అనిపించక మానదు, ఇంగ్లీషులో ఇతే like,love కి పెద్ద తేడా అనిపించదు..ఇలాంటప్పుడే కొన్ని తెలుగు పదాలు వాడడం పూర్తిగా మానేస్తే పోదా అని,
ఇంతకుముందు ఇల్లు, పొలాలు ఆస్థులు అవి ఎవరికో ఒకరికి సొంతం అని అనుకునేదాన్ని, కానీ మనుషులు ఎప్పటినుండి ఆస్తిగా మరిపోయారో తెలియనేలేదు.. ఇలాంటి ఆలోచనా ఊహా ఇంతకుముందు ఎపుడు ఉండేది కాదు, ఎందుకో ఎప్పుడు నా స్నేహితులే చాల గొప్పగా అనిపించేవారు..వాళ్ళు ఎవరి ఆస్తిగా పరిగణింపబడి నేను ఇబ్బంది పడింది కూడా లేదు, కానీ తరవాత ఎంతో మంది బంధువులు కావొచ్చు , తెలిసినపిల్లలు కావొచ్చు ఎన్ని సంవత్సరాలు ఉన్నా, నా దగ్గరే పెరిగినా కూడా వారిపై ఇష్టాన్ని మాటల్లో చేతల్లో చూపడం కూడా చేయకూడదు వాళ్ళంతా ఎవరికో చెందినా ఆస్తిగా మాత్రమే చూడాలి .. మనం వారిని మన ఇంటికి ఆహ్వానించాలి అంటే మన ఇంట్లో ఫంక్షన్ ఐనా ఉండాలి లేదా ఏదైనా బంధుత్వం ఉండాలని ఒక కొత్త రూల్ కూడా ఉంటుంది...వారంతా ప్రేమ బంధీలు కాబోలు..
ఎవరు ఎంత ఇబ్బందిబడినా ..ఎవరి రూల్స్ వారికీ ఉంటాయి, ఎవరి ఆస్తికి వారు కాపలా ఏర్పాటు చేసుకుంటారు, నా ఇష్టం నాతోనే ఉంటుంది, వ్యక్తులు మారుతూ ఉంటారు, నా ఇష్టం వారితో చెలిమి చేస్తూనే ఉంటుంది...జీవితం ఆశలతో, ఊహలతో ఆకాశానికి రహదారి వేస్తూ సాగుతూనే ఉంటుంది...అలోవోకగా తటిల్లున మెరిసే పెదవిపై చిరునవ్వులా...
ఇష్టం మీద ఇష్టంతో రాసిన ఆర్టికల్ ....
ఇష్టం చాలా చిన్న పదం, కానీ ఆ పదం వెనుకు ఉన్న భావాలు అనంతం. ప్రతీ మనిషికి తనకు నచ్చింది చెప్పడానికి వాడే పదం 'ఇష్టం'. మనలో చదువు సంస్కారం, అభివృద్ధి, ఆలోచనా పరిధి పెరిగే కొద్ది .. అభిమానము ఆప్యాయత,అనురాగం, ప్రేమ యిలా మనము వాడేపదాలు చాలా ఉంటాయి. పుట్టకతో వచ్చే చిరునవ్వులా ప్రతీ వారికి అనుభవంలోకి వచ్చే పదం 'ఇష్టం...'
for more click this link....