3, ఏప్రిల్ 2014, గురువారం

ఆమెను చూసినప్పుడల్లా



నా కనురెప్పలు
కౌగిలించుకునీ మరీ
బంధించింది.....
నా కనుపాపను కాదు
నీ రూపాన్ని!!
ఆమెను చూసినప్పుడల్లా
అనిపిస్తుంది

ఈరోజు

ఎలాగైనా

జీవించేద్దామని ......




కట్టలు తెంచుకున్న నీళ్ళు....

ఏటిని ముంచితే వాన....
ఊరిని ముంచితే వరద....
మనసును ముంచితే దుఃఖం....
పరిమితి తెంచుకున్న శబ్ధం...

నోటిని దాటితే గీతం....
వాద్యాన్ని దాటితే సంగీతం...
మనసుని దాటితే నిశ్శబ్ధం....
-నాగసాయిసూరి




ఆమె కళ్ళల్లోకి చూస్తూ అతను   అడిగాడు 
నన్ను నమ్మగలవా అని
కనురెప్పలు కిందకు దించి ఆమె 
ఇలా అంది 
నిన్ను నమ్మగలనో లేదో నీవు గ్రహించలేనంత 
వరకు
నేను నమ్మడం 
నిన్ను నమ్మించడం.. రెండూ పూర్తవ్వవు అని
.. మీ చాంద్



మీ కంటికి నచ్చే ఎన్నో విషయాల
గురించి మీరు పరుగులు
తీస్తుండవచ్చు...
కానీ మీ హృదయానికి
నచ్చేవిషయం గురించే
అన్వేషించండి ........
నయనానందం

క్షణికం....

హృదయానందం శాశ్వతం....


ఇదేమిటి కన్నా! ఇక్కడ ఇంతలా బొప్పికట్టిందేం ?" అన్నాడతను, 
ముని వేళ్ళతో నిమురుతూ...

"నేను ఏమరుపాటుగా ఉన్నప్పుడు
ఓ చిన్న శబ్దమొచ్చి 
మెత్తగా నన్ను తాకింది" 
అన్నదా నిశ్శబ్దం!.... 

- రావూరి భరద్వాజ