తదేకంగా చూస్తున్నా... మదినిండా అలలలాంటి ఆలోచనలతో.............
కడలి.....అనంతమైన అపురూపమైన కడలి......అలలు లేని కడలి....ఎంత ప్రశాంతంగా ఉంది... చిన్నిపాప నవ్వులా...
తదేకంగా చూస్తున్నా... మదినిండా అలలలాంటి ఆలోచనలతో.............
కడలి.....అనంతమైన అపురూపమైన కడలి......అలలు లేని కడలి....ఎంత ప్రశాంతంగా ఉంది... చిన్నిపాప నవ్వులా...
అపుడు చేరింది .... నాచెంత... చిరుసవ్వడితో జలతారు లాంటి
వెలుగురేఖలా...
అలలు లేని కడలి అన్నావు.. అలా ఎప్పుడైనా ఎక్కడైనా విన్నావా... నీ కనుచూపుమేర కానరానంతనే అలలు లేని కడలి అవుతుందా... ఈ ప్రశాంతతకి కారణం ఒకటే... చుట్టూ కనిపించే నీ లాంటి వారంటే ఇష్టం ఏమో అందుకే ప్రశాంతతని ఆభరణంగా మలచుకున్నా .... కడలి అడుగున ఎన్ని వింతలూ, ఎన్ని విచిత్రాలు, ఎన్ని అగ్నిపర్వతాలు, ఎన్ని నిగూఢ రహస్యాలు, ఎన్ని అలజడులు .. వాటితో పాటే ఎన్ని అందమైన సోయగాలు..... అన్నిటిని అరచేత గుప్పిట మూసి ... అలజడి తెలియని అమాయకపు పసిపాపలా ప్రశాంతంగా చిరుసవ్వడి చిన్ని అలలతో నా పాదాలతో సరాగాలు ఆడుతూ .....నది లాంటి నువ్వు అల్లకల్లోలమయ్యే కడలి వి కాకూడదని నీకై వచ్చా నంటూ ... చిరుజల్లు మోముపై జల్లి .. జీవితం ఎంతో అందమైనదంటూ... సాయంకాలపు నీడలా నన్ను వీడి వెళ్ళింది సుగంధాల పరిమళాలు వెదజల్లుతూ....

ఇలాంటి భావాలెన్నో మనం ఒంటరిగా ఉన్నపుడు మనచుట్టూ చేరుతాయి అందులో కొన్ని మనకోసమే పుడతాయేమో అని అనిపిస్తుంది.. .. జీవితం అన్నాక అన్నో పరిణామాలు... అన్ని ఆనందింపచేసేవే కాదు కొన్ని మన అస్తిత్వాన్ని ఆనవాలు లేకుండా చేసేవి కూడా ఉంటాయి.. అపుడు మనకు వచ్చే ఆలోచనలు తీరు తెన్నూ లేకుండా గాలివాటంగా కొట్టుకుపోతుంటాయి... ఆ ఆలోచనలు అడ్డుకట్ట వేయాలంటే ఒక చేయూత కావాలనుకోవడం తప్పులేదు... కాని అది కూడా మనమే చేకూర్చుకోగలిగితే అంతకన్నా పెన్నిధి వేరొకటి లేదు.... కొన్నిసార్లు మనకు ఏమి కావాలో కూడా తెలియనంతగా ఆలోచనలతో, అలజడితో అతలాకుతలం అయిపోతాం... అందులో నుండి బయటపడడానికి మనకు ఏమి కావాలో తెలియకున్నా... మనం ఎలా ఉండాలో తెలుసుకోగలిగితే అదే మన మనసుకు మంత్రం గా పనిచేస్తుంది... వీటన్నిటికంటే ముందుగా మనము ఇష్టంగా నెరవేరాల్సిన బాధ్యతలు మన మనసుని వీడకుండా చూసుకోవడం... బాధ్యతలు పెద్ద బరువులు అంటారు కాని అదే మన జీవితనౌకకి చుక్కాని వంటిది.....
నీవెక్కడికి పోవు... నువ్వంటే నీకు ఇష్టమైనపుడు... నీవు అలజడినిండిన మదితో అనంతమైన కడలి కెరటాల మధ్య చిక్కి ఉక్కిరి బిక్కిరి అవుతున్నా... ఇంద్రధనస్సు లాంటి ఊహలు.. చిరుజల్లు లాంటి పుస్తకం.. జ్ఞాపకం వంటి నేస్తం.. దేవుడు అందించిన ఈ ప్రకృతి నేకై స్నేహ హస్తం అందిస్తాయి.. నీవు వద్దన్నా... కాదన్నా....