మనతో పరిగెడుతున్న కాలం..కాలంతో పోటీ పడుతూ మనం....నేను ఆనందంగా ఉన్నాను కాదా నా కంట్లో తడి ఆరిపోయిందేమో అనుకునే క్షణం... సుదీర తీరం నుండి చిన్న వార్తా... చిన్న మాట అదేంటి పేరు కూడా మనసుకు తట్టడం లేదు కానీ ఎందుకు మదిలో ఆలోచనలేమీ నాకు అందడం లేదు..కంటినుండిధారగా కన్నీళ్లు తప్ప వేరే ఏమి కనిపించడం లేదు...ఐనా వెక్కి ఏడవడం లేదు...నేను పెనవేసుకున్న జ్ఞాపకాలు నాకు మాత్రమే పరిమితం అన్న విషయం క్షణకాలం కూడా మరపుకు రాకుండా ఎలా ఉంది...నిజంగా నాకు బాధగా ఉందో లేక నలుగురి మధ్య నా బాధ్యత మరవకుండా కన్నీళ్ళకు అడ్డుకట్ట వేస్తూ ఉన్నందుకు సంతోష పడుతున్నానో తెలియని సమయం ..ఆనందరేఖలకు తెరకట్టి ఆవేదన చీకటిలో అలసటగా వాలిపోవాలని..వీటి మధ్య మనుషులు కనుమరుగు కాగానే అలా రాలే కన్నీటి చుక్కలు చూసి మనసెరిగిన ప్రియ ప్రియబాంధవి ఇదేనేమో అని ఇన్నేళ్ళకు కన్నీరుపై ఒకింత ఇష్టం కలిగింది అనిపించింది.
నీలం మూడు సంవత్సరాల పరిచయం...ఎక్కడో కాశ్మీర్ లో పుట్టి పెరిగిన అమ్మాయి..తెలుగే తెలియని అమ్మాయి..ఇక్కడ ఒక చిన్న పరిచయం...తెలియకుండానే మనసుకు నచ్చిన అమ్మాయి. ఎన్ని ఆశలు.. ఎన్ని ఇష్టాలు..క్యాన్సర్ అని తెలిసిన క్షణం నాకు తగ్గిపోతుంది కదా...నాకు జుట్టు పొతే మా ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందేమో...అలా జరక్కుండా ఏమి ట్రీట్మెంట్ లేదా అని అడిగిన అమ్మాయి... తప్పని సరి అయ్యేవరకు ఇంట్లో ఎవరికీ తెలియ పర్చకుండానే treatment మొదలుపెడ్డింది ఏమి తెలియని ఈ హైదరాబాద్ లో 26 సంవత్సరాల నీలం.....ఒక సంవత్సరం పోరాడి గెలిచానోచ్ అంటూ....ఎన్నో ఆశలు, ఎన్నో ఊహలతో వాళ్ళ ఊరు వెళ్ళింది..కొన్ని నెలలు తిరక్కుండానే కోరి చేసుకుంటాను అంటూ వరుడు ఎదురయ్యాడు...treetment చేసిన డాక్టర్ ఇపుడు వద్దు ఇంకో సంవత్సరం ఆగమన్నాడు. ఆశకి... ఆలోచనలకి స్నేహం కుదరలేదు....ఉహాలతో పెళ్లిచేసుకొని....ఇదిగో మా హనీమూన్ photoes అంటూ వచ్చింది...ఈ సారి బ్రెయిన్ కి cancer అన్నారు...treatment కుదరదు అన్నారు.. నిశ్శబ్దంగా 15 రోజులు సెలవుపెట్టి మళ్ళీ వస్తా నంటూ కాశ్మీర్ వెళ్ళింది...మొన్న శనివారంతో తనకి సెలవులతో పనేలేదంటూ సెలవు తీసుకుంది..ఇప్పుడు ఎక్కడో భూదేవి వడిలో నిదురిస్తుంది..(ఇది నీలం మాట..చోటి చోటి చీజోంకో క్యూ పకడ్ కె రక్తే ...రిస్తోంకో పకడియే )..తన రూపు కనుమరుగు అయిపోతుంది కానీ నా తలపుల్లో ఎక్కడో దాగివుంటుంది...తన పేరు మనసు ఊహలో ఉండిపోతుంది....నా మాటల్లో ఒక కథగా మిగిలితుంది..నీలం ఇపుడు నా అద్దాల భరిణెలోని జ్ఞాపకం.