జీవితం చాలా వడివడిగా పరుగులు తీస్తుంది.. నీవు ఆనందంగా ఉన్నావా, నిస్పృహతో నిట్టూరుస్తున్నావా అన్న దానితో పనిలేదు.... జీవితానికి సెలయేరులా పరిగెడుతూ, చూసేవారిని ఆకట్టుకుంటూ, అసూయతో రగిలేవారిని తన పరుగుతో ఓడిస్తూ, తనను ఆదరించేవారిని తన ఒరవడి సవ్వడితో ముగ్ధుల్ని చేస్తూ, స్వచ్ఛమైన నిజాయితీ గల ఒరవడి ఉన్న తనని ఆకట్టుకునే మనసున్న మనుషులకోసం నిశితంగా అన్వేషిస్తూ అలసట ఎరుగని జీవితం సాగుతూనే ఉంది.
ఎవరో ఒకరు తన(జీవితం) ఎదుట నించొని ఎక్కడికి పరిగెడుతావు...నీవు ఓదిగిపోవాల్సింది ఈ మనుషుల అరచేతిలోనే అంటూ ప్రశ్నిస్తే....ఓయీ...... నేను నిన్ను ప్రేమతో ఆదరించి ... ముగ్దమనోహర కౌగిలిలో చోటిచ్చాను... అయినా నీవు నన్ను ప్రేమించకపోగా ..నా స్వేచ్చను హరించే ప్రయత్నంలోనే ప్రతీ క్షణం పోరాటానికి సిద్దమవుతుంటే... ప్రేమ లేనిచోట ఈ జీవితానికి మాత్రం చోటేది...
నిజమే కదా... డబ్బుని ప్రేమిస్తాం, పనిని ప్రేమిస్తాం , మన శత్రువుని కూడా ప్రేమిస్తాం ద్వేషంతోనైనా ...కాని తనపై తనకు మాత్రం ఇష్టం, ప్రేమ, ఆదరణ, ఆత్మగౌరం మాత్రం సూన్యం ఐనపుడు... మనిషి తనని తను ప్రేమించలేడు... తమపై ఇష్టం లేనివారికి .... ప్రేమ అనే పదానికి అర్ధం ఎలా తెలుస్తుంది... తనపై ప్రేమ లేనివానికి.. జీవితం పై ఆరాధన ఎలా ఉంటుంది.. అటువంటి చోట అరచేతిలో జీవితం ఎలా జీవిస్తుంది....