మనలో ఉన్న ప్రతీ స్పందన ఎదుటివారిలో కనిపించాలనిలేదు కానీ ఎవరో ఒకరిలో మాత్రం కనిపిస్తుంది అన్నది అక్షర సత్యం.ప్రపంచంలో మనలాంటి వారు ఏడుగురు ఉంటారట అన్న నానుడి ఉంది.. నిజంగా ఏడుగురు కాదండీ ఏడు కోట్లమంది ఉంటారు...ఎందుకంటే ప్రతీ ఒక్కరిలో మనలోని ఏదో ఒక భావం.. ఆలోచన. ఊహా.. అలవాటు.. ఆశక్తి ఎదుటివారిలో ఉంటాయన్నది సత్యం అది మనం గుర్తించినా గుర్తించకున్నా... .అందుకే నా బ్లాగ్ పేరు మీలో నేను....
6, ఏప్రిల్ 2015, సోమవారం
జ్ఞాపకాల ఆనవాలు....
నీకోసం వేచియున్నా అని మరచి,
నది ఒడ్డున గులకరాళ్ళు ఏరుకుంటున్నా వెనుదిరిగి చూసేసరికి ...... ........... నువ్వు వదిలి వెళ్ళిన అడుగుజాడలే కనిపించాయి అల్లంత దూరంలో...... ........