17, నవంబర్ 2011, గురువారం

మీ తాటాకు బొమ్మ ఏది...

గతకాలపు  బొమ్మ .... ఈ తాటాకు బొమ్మ
రంగు వెలసిన బొమ్మ...ఈ తాటాకు బొమ్మ
మనసున్న బొమ్మ..నేను మరవలేని బొమ్మ..ఈ తాటాకు బొమ్మ
ఎప్పుడో ఎక్కడో చదివిన కథ ఎందుకో అలా గుర్తిండి పోయింది, ఎంతగా అనిపిస్తుందంటే అది నా ఊహనో, నా ఆలోచన నేమో, అది నేను ఒకప్పుడు చదివిన కథ నేనా.. అని ప్రశ్నించుకునేంతగా నా మనసుని అల్లుకుపోయింది....
ఒక ఊరిలో ఒక అమ్మాయి,అప్పటికి ఆ అమ్మాయి వయస్సు 17 సంవత్సరాలు ,తన చుట్టూ అంత చిన్న పిల్లలే అక్కా నీ పెళ్లి అంట కదా...నువ్వు వేరే ఊరు వెళ్లి పోతావట కదా!నీ పెళ్ళికి మేనా ఉంటదా ఇలా ప్రశ్నల పరంపరా... అందరిలో పెద్దవాడికి 10 సంవత్సరాలు, పద్మా నీకేం భయం లేదు ,నాకు చెప్పావంటే చాలు నేను నీకోసం వచ్చేస్తా ఎలాగైనా అని అభయం ఇచ్చెసాడు, అది విని ఫక్కున నవ్వింది పద్మ..
పద్మ పెళ్లి ఐపోయింది అత్తగారింటికి వెళ్ళిపోయింది..నెలలు గడిచిపోయాయి...ఒకసారి తన తల్లిగారింటి నుంచి తెచ్చుకున్న ట్రంకుపెట్ట తెరిచింది పద్మ ఆడపడుచు..అందులో ఎప్పుడో వేసుకున్న ముగ్గుల పుస్తకం, తల్లిగారిచ్చిన కుంకుమ భరణి ఇంకా అడుగున ఒక తాటాకు బొమ్మ...
 ఆ తాటాకు బొమ్మ చూసి ఆడపడచు ఒకటే నవ్వు ఓదినా!
 ఈ ఎండిపోయిన పాత తాటాకు బొమ్మ ఇలా దాచుకున్నావ్..అంటూ విసిరేయబోయింది.. గభాలున అందుకొని దాన్ని జాగ్రత్తగా పట్టుచీర అడుగున దాచేసింది...
అది  ఒక్కప్పుడు తన చిన్నారి నేస్తం నేను ఉన్నా అంటూ అభయం ఇచ్చి ,నా గుర్తు అంటూ ఇచ్చిన తాటాకు బొమ్మ అది...రంగు వెలసిపోయినా, ఎవరు లేరన్న బెంగా దరిచేరకుండా తనతో ఉన్న తాటాకు బొమ్మ,ఎవరు ఇవ్వని భరోసా ఇచ్చింది నేనున్నంటూ ....

ప్రతీ ఒక్కరికి జీవితంలో ఒక తాటాకు బొమ్మ ఉంటుంది ఒకరికి మంచి నేస్తం ఇతే, ఒకరికి పుస్తకం, ఇంకొకరికి అందమైన కల, వేరొకరికి మదిలోని ఊహ...మరి మీ తాటాకు బొమ్మ ఏది....

13, నవంబర్ 2011, ఆదివారం

నేను వ్రాసిన కథ...

కొన్ని ఊహలు కొన్ని జ్ఞాపకాలు మనలని వెంటాడుతూనే ఉంటాయి..కొన్ని సంఘటనలు మనకు తెలియకుండానే మన మనసులో ఒక కథగా మారిపోతుంది... మనకు పరిచయం ఉన్నవాళ్లు ఇందులో నేను ఎక్కడా అని వెతుక్కుంటారు...ఎవరో ఒకరికి ఇది నాదే అని అనిపించక మానదు....అలాంటి  కథే ఈ మనసులోని మర్మం....




 నేను ఈ ఊరు వచ్చి సుమారు ఐదు ఏళ్ళు అవుతుంది, మా ఊరు చూడగానే అనసూయమ్మ మనసులో మెదిలింది. ఇల్లు చేరానో లేదో అమ్మా! అనసూయమ్మ ను  చూసి వస్తా..నంటూ కదిలాను.. అమ్మ కాఫీ అనే మాట కూడా వినిపించుకోకుండా..
నాకు ఆవిడకు 20 ఏళ్ల తేడా ఐన నాకు ఆవిడని పేరు పెట్టి పిలిచే  అలవాటు ఎలా మొదలైందో  మాత్రం గుర్తులేదు.
 అనసూయమ్మా.. అంటూ గబా గబా వెళ్లాను లోపలికి, పెరట్లో ఎప్పటిలాగానే బియ్యం ఏరుతూ, పిట్టలకు కొంచెం చల్లుతూ  సందడిగానే కనిపించింది.
ఏంటి.. పిల్లల తల్లివయ్యావు..ఇంకా పిల్ల చేష్టలేంటే  కవిత అంటూ.. నా బుగ్గలు పుణికి పుచ్చుతూ..కాఫీ ఐనా తాగావా లేదా! అంటూ లోనికి నడిచింది.అన్నీ మాములుగానే కనిపిస్తున్న ఎందుకో అనసూయమ్మా లో నాకు ఏదో వెలితి కనిపిస్తుంది..నేనే పొరపాటు పడుతున్ననేమో ఇద్దరి మధ్యన సాన్నిహిత్యం తరిగి అని నాకు నేను సర్దిచెప్పుకున్నా..ఆ ఊరి కబుర్లు మా ఊరి కబుర్లు అయ్యాక.. ఒక కథ చెప్పు అనసూయమ్మా.. నువ్వు కథ చెప్పే వరకు వెళ్ళనే వెళ్ళాను..అన్నీ తెలిసిన కథలే కదా అనకు.. నువ్వు చెప్పే ఏ పిట్ట కథో, కోడి కథో ఐన పర్లేదు కాని...ఇపుడు కాదు మళ్లీ చెపుతా అని మాత్రం అనకు అని టిఫన్ ప్లేట్లు తీసుకొని పెరట్లోకి నడిచా........
click here for full story.....


http://beditor.com/telugu-stories/191-manasuloni-marmam


మీలో..నేను..

ప్రతీవారిలో మనం ఉంటామా...
ఎన్నో కలలు,మరెన్నో జ్ఞాపకాలు,మధురమైన ఊహలు, మరవలేని తలపులు, పదునైన ఆలోచనలు, కొన్నిటిపై ఆశక్తి మరికొన్నిటిపై అనాశక్తి,ఎన్నిటిపైనో ఆశ ఇంకొన్నిటిపైన పేరాశ, ఇంకా ఇష్టాలయిష్టాలు ఎన్నెన్నో ప్రతీ మనిషిలోనూ..ప్రేమ తలపులు, ఈర్ష అసూయ ద్వేషభావాలు,అనురాగం ఆప్యాయత,అనురాగం,ఆదరణ,జాలి దయ, కరుణ ఎన్నెన్ని అలవోకగా పలికే పదాలు, మనిషిలోని మనసు వీటిలో ఏదో ఒకదానికి స్పందిస్తూనే ఉంటుంది

మనలో ఉన్న ప్రతీ స్పందన ఎదుటివారిలో కనిపించాలనిలేదు కానీ ఎవరో ఒకరిలో మాత్రం కనిపిస్తుంది అన్నది అక్షర సత్యం. నాలోని ఆశలు ఒకరిలో కనిపిస్తే నా ఊహలు వేరొకరి కవితలో తొంగిచూడొచ్చు.మనకు ఎదురయ్యే ప్రతీ వారిలో మనలోని ఏదో ఒకటి ఉంటుంది కానీ అది గుర్తించాలన్న అభిలాష కానీ సమయం మనం పెట్టుబడిగా పెడితే ప్రతీవారిలో మనం ఉంటాము.ప్రపంచంలో మనలాంటి వారు ఏడుగురు ఉంటారట అన్న నానుడి ఉంది.. నిజంగా ఏడుగురు కాదండీ ఏడు కోట్లమంది ఉంటారు...ఎందుకంటే ప్రతీ ఒక్కరిలో మనలోని ఏదో ఒక భావం.. ఆలోచన. ఊహా.. అలవాటు.. ఆశక్తి ఎదుటివారిలో ఉంటాయన్నది సత్యం అది మనం గుర్తిచినా గుర్తించకున్నా... .అందుకే నా బ్లాగ్ పేరు మీలో నేను....