13, నవంబర్ 2011, ఆదివారం

మీలో..నేను..

ప్రతీవారిలో మనం ఉంటామా...
ఎన్నో కలలు,మరెన్నో జ్ఞాపకాలు,మధురమైన ఊహలు, మరవలేని తలపులు, పదునైన ఆలోచనలు, కొన్నిటిపై ఆశక్తి మరికొన్నిటిపై అనాశక్తి,ఎన్నిటిపైనో ఆశ ఇంకొన్నిటిపైన పేరాశ, ఇంకా ఇష్టాలయిష్టాలు ఎన్నెన్నో ప్రతీ మనిషిలోనూ..ప్రేమ తలపులు, ఈర్ష అసూయ ద్వేషభావాలు,అనురాగం ఆప్యాయత,అనురాగం,ఆదరణ,జాలి దయ, కరుణ ఎన్నెన్ని అలవోకగా పలికే పదాలు, మనిషిలోని మనసు వీటిలో ఏదో ఒకదానికి స్పందిస్తూనే ఉంటుంది

మనలో ఉన్న ప్రతీ స్పందన ఎదుటివారిలో కనిపించాలనిలేదు కానీ ఎవరో ఒకరిలో మాత్రం కనిపిస్తుంది అన్నది అక్షర సత్యం. నాలోని ఆశలు ఒకరిలో కనిపిస్తే నా ఊహలు వేరొకరి కవితలో తొంగిచూడొచ్చు.మనకు ఎదురయ్యే ప్రతీ వారిలో మనలోని ఏదో ఒకటి ఉంటుంది కానీ అది గుర్తించాలన్న అభిలాష కానీ సమయం మనం పెట్టుబడిగా పెడితే ప్రతీవారిలో మనం ఉంటాము.ప్రపంచంలో మనలాంటి వారు ఏడుగురు ఉంటారట అన్న నానుడి ఉంది.. నిజంగా ఏడుగురు కాదండీ ఏడు కోట్లమంది ఉంటారు...ఎందుకంటే ప్రతీ ఒక్కరిలో మనలోని ఏదో ఒక భావం.. ఆలోచన. ఊహా.. అలవాటు.. ఆశక్తి ఎదుటివారిలో ఉంటాయన్నది సత్యం అది మనం గుర్తిచినా గుర్తించకున్నా... .అందుకే నా బ్లాగ్ పేరు మీలో నేను....