ఎంత ఎదిగినా, ఎలా ఉన్నా, ఆశల వెంట పరిగెత్తినా, ఆశయాల కోసం నిలబడినా,
నువ్వయినా, నేనయినా ..మనకు మనం ఎంతో తెలిసినా ..మన మనసు పొరల్లో నీలి నీలి
ఆకాశం లాంటి ఓ కల, చిన్ని కోరిక ఒదిగి ఒదిగి ఉంటుంది.
ఎపుడో
ఒకప్పుడు అలసట తీరక నిదురరాని రాత్రో.. ఆనందపు ఆశలు కెరటాల్లా నేరవేరుతూ,
అద్బుతమైన జీవితం అందుకుంటూ ఉన్నపుడో, ఎంత హాయిగా సాగిపోతుంది జీవితమంటూ
ప్రశాంతంగా ఉన్నపుడో, జీవితంలో నాకంటూ ఏ కోరికా లేదంటూ వల్లె
వేస్తున్నపుడో, నీ మనసు పొరల్లో అలజడి పగటికలలా ఎదుటనిలుస్తుంది...దానిపేరు
ఒకరు జ్ఞాపకం అంటే, ఇంకొకరు ఆశ , వేరొకరు కోరిక పేరు ఏదైతేనేం.. మీరు
దానికి మీ ఊహలు జోడిస్తూ ఆనందం పొందుతారు అన్నది నిజం..అది ఆవేదనా అంటూ
కొందరన్నా..ఆవేదన పొందేవారికి మాత్రం అది స్వాంతన చేకూర్చేదే..
సమయం
ఏదైనా కానీ, వయసు ఏదైనా కానీ..తళుక్కున పిచ్చక గూళ్ళు కట్టిన నేస్తం,
చిన్న మాట పట్టిమ్పుతో దూరమైనా బంధాలు, అడగకనే చేయూత నిచ్చిన ఎందఱో
స్నేహితులు, తెలిసినవాళ్ళు.. అందరూ మనవాళ్ళు, మన వీధీ, మన ఊరు ..కొందరితో
పోట్లాడి, మరికొందరిని నాతో మాట్లాడకు అని నెట్టేసి, ఎలా ఉన్నా అందరూ
అక్కడే అలానే ఉంటారాన్ని నమ్మకం..కాలంఒడిలో ఎక్కడెక్కడో జారిపోతారన్న ఆలోచన
కూడా లేకుండా గడిపేసిన కాలం..........తప్పిపోతారని తెలిస్తే వాళ్ళ
చిరునామా, ఫోన్ నెంబర్ తీసుకుని దాచుకునేవాళ్ళం అని ఇదిగో ఇలా ఇపుడు "అది
ఒకప్పటి జ్ఞాపకం అంటూ " అనుకుంటూ..గడిపేస్తున్నా.. అందులోని చిన్ని ఆశలకు,
కోరికలు తటిల్లున కనుల ముందు నిలుస్తాయి....ఎదిగే పిల్లలను చూస్తూ
ఉన్నపుడు....
మన కళ్ళెదుట కనిపించే పిల్లలను చూస్తూ ఉంటే వాళ్ళ
మాటలు వింటూ ఉంటే..అయ్యో! ఈ కనిపించే జీవితం అందమైనది. అరచేతిలో దాచుకో అని
చెప్పినా... ఎలా నమ్ముతారు, మళ్ళీ అవే పనులు కోపం వచ్చిందని మాట్లాడక,
facebook లో unfreiend అంటూ ..మామూలే వాళ్ళలో నన్ను చూసుకుంటూ నేనిలా,
ఎదిగే పిల్లలు ఇదే జీవితం అన్నీ ఇలానే ఉంటాయంటూ అలా...
ఏది ఏమైనా .....జీవితం అందమైనది... ఒడిసిపట్టుకున్న ఒదిగిపోదు, అరచి అల్లరి చేసినా మనల్ని వీడిపోదు..
మనతో మదిలో అణువంత చోటులో అనంతమైన ...ఆనందం.....