18, నవంబర్ 2013, సోమవారం

మనసులోని మాట...


మనిషి కి ఏమి కావాలి.. ఈ ప్రశ్నకి జవాబు చెప్పడం చాలా సులువు అని విన్నవారంతా అంటారు..నిజంగా అంత సులువైన ప్రశ్నే ఐతే అది ఎపుడో తన అస్తిత్వం కోల్పోయేది....కఠిన మైన ప్రశ్నకి , అగమ్యగోచరమైన రహదారికి, వికృత రూపికి ప్రచారం తక్కువ..కానీ వాటిపై అందరికి ఆశక్తి అందరికి ఎక్కువ..

మనిషి తనకు లేనిది మాత్రమే కావాలనుకోడు ..తనకు ఉన్నదే ఇంకా కాస్త కావాలి అనుకోడు...పోనీ దేవుడే దిగివచ్చి అడిగినవన్నీ ఇచ్చినా ఇంకా ఒకటి మిగిలే ఉంటది కానీ వద్దు అని మాత్రం అనడు.తన ఇగో తృప్తిపడే విధంగా ఆతను అనుకున్నట్టుగా జీవితం జరగడం కావాలి.. 
అలా జరగాలి ఆంటే తన వ్యక్తిత్వమే ఫణంగా పెట్టాలి....

నా ప్రశ్నకు ఈ జవాబు ఎలా ఒప్పుకోవాలి ....వ్యక్తిత్వం వదులుకున్నవాడిని మనిషిగా ఎలా అంగీకరించాలి..మీరే చెప్పండి.....

15, సెప్టెంబర్ 2013, ఆదివారం

జీవితపు పంటకు... సమస్యల సహకారమా.....???

ఉత్కంఠ భరితమైన వార్తలంటేనే అందరికీ ఆసక్తి. 'ఎవరో ఇద్దరు ప్రేమగా కాపురం చేస్తున్నారు, సంతోషంగా జీవిస్తున్నారు' అన్న వార్త చప్పగా ఉంటుంది. కానీ మన జీవితం మటుకు ఏ ప్రతిఘటన లేకుండా, ఒడిదుడుకులు లేకుండా ఉండాలని కోరుకుంటారు.


ఒకసారి రైతు దేవునితో పోట్లాట వేసుకున్నాడు. "నీకు వ్యవసాయం గురించి ఏమి తెలుసు? నీవనుకున్నప్పుడే వర్షాలు కురిపిస్తున్నావు. నీ వల్ల చాలా ఇవ్వండిగా ఉంది. నా మాట విని ఈ పనులన్నీ ఒక రైతుకు ఇచ్చెయ్" అన్నాడు.

దేవుడు, "ఎండా, వాన, గాలి అంతా నీ వశంలో ఉండుగాక" అని వరమిచ్చేసి వెళ్ళిపోయాడు.

పంటల కాలం వచ్చింది.
"ఓ వాన, కురువు!" అన్నాడు. వాన పడింది! ఆగమంటే ఆగింది! నేలను దున్నాడు. కావలసిన వేగంతో గాలిని రమ్మన్నాడు. విత్తనాలు జల్లాడు. గాలి, వాన, ఎండా అన్నీ ఆటను చెప్పినట్లు విన్నాయి. చేలు పచ్చగా ఎదిగాయి.
కోతల కాలం వచ్చింది. రైతు ఒక వరికంకిని కోశాడు. తీసి చూసి నివ్వెరపోయాడు! లోపల ధాన్యం లేదు. వెంటనే మరో కంకిని కోసి చూశాడు. దానిలో కూడా ఏమి లేదు.

"ఓ భగవంతుడా గాలి,వాన, ఎండ అన్నింటినీ సమంగానే వాడాను అయినా కానీ పంట ఎందుకు దెబ్బతిన్నది!" అంటూ కోపంగా దేవునిపై అరిచాడు.

దేవుడు "నా దగ్గరున్నప్పుడు గాలి వేగంగా వీచేది, అప్పుడు పైరు అమ్మను గట్టిగా వాటేసుకునే పసిపిల్లలా భూమిలో తమ వేర్లను చాలా లోతుల్లోకి తీసుకెళ్ళేవి. అలాగే వాన తగ్గిందంటే, నీటిని వెతుక్కుంటూ వేర్లను నాలుగు దిక్కులకూ పంపించేవి. పోరాట పటిమ ఉంటేనే మొక్కలు  తమను తాము కాపాడుకునేందుకు బలంగా పెరుగుతాయి. అన్నింటికీ వసతులు కల్పించి ఇవ్వగానే నీ పంటకు సోమరితనం వచ్చేసింది. ఏపుగా ఎదిగిందే గాని, ధాన్యం ఇవ్వడం దానిచేత కాలేదు" అన్నాడు.

"వద్దు స్వామీ! ఇలాగైతే నీ వాన, గాలి నువ్వే ఉంచుకో" అని ఆ రైతు వాటిని దేవునికి అప్పగించేశాడు.
జీవితంలో అన్నీ సులభంగా సమకూరితే, ఆ జీవితం ఇలాగే ఉంటుంది. దానికి మించిన శూన్యం వేరొకటి ఉండదు. ఊహించని అనుభవాలు ఎదురొస్తే, జీవితంలో అనుభవించి తెలుసుకునే అవకాశాలుగా వాటిని భావించాలి. చిక్కులు వచ్చినప్పుడే మన సామర్ద్యం ఏమిటి? మనం ఎక్కడ ఉన్నాం అన్నది స్పష్టంగా తెలుస్తుంది.

చీకటి సమస్య ఉన్నదుకే కదా విద్యుద్దీపాలు కనుగొన్నారు. సమస్యలే లేకుంటే మన మెదడు పనితీరు ఏ విధంగా ఉందొ ఎలా తెలుసుకోగలము? వాస్తవానికి మన పధ్ధతి సరిగా లేనపుడు. సాధారణ పరిస్థితులు కూడా సమస్యలుగా కనిపిస్తాయి.

ఎవరు అడిగినా అడగకపోయినా, ఈ ప్రపంచం మనపై సమస్యలను విసిరి, తమాషా చూడాలనుకుంటది. మరి వాటిని ఎదుర్కోడానికి సిద్దంగా ఉండడానికి భయం ఎందుకు..... (-జగ్గీ వాసుదేవ్, సాక్షి )

9, సెప్టెంబర్ 2013, సోమవారం

జీవితం ....స్వేచ్చా విహంగం


జీవితం చాలా వడివడిగా  పరుగులు తీస్తుంది.. నీవు ఆనందంగా ఉన్నావా, నిస్పృహతో నిట్టూరుస్తున్నావా అన్న దానితో పనిలేదు.... జీవితానికి సెలయేరులా పరిగెడుతూ, చూసేవారిని ఆకట్టుకుంటూ, అసూయతో రగిలేవారిని తన పరుగుతో ఓడిస్తూ, తనను ఆదరించేవారిని తన ఒరవడి సవ్వడితో ముగ్ధుల్ని చేస్తూ, స్వచ్ఛమైన నిజాయితీ గల ఒరవడి ఉన్న తనని ఆకట్టుకునే మనసున్న మనుషులకోసం నిశితంగా అన్వేషిస్తూ అలసట ఎరుగని జీవితం సాగుతూనే ఉంది.

ఎవరో ఒకరు తన(జీవితం) ఎదుట నించొని ఎక్కడికి పరిగెడుతావు...నీవు ఓదిగిపోవాల్సింది ఈ మనుషుల అరచేతిలోనే అంటూ ప్రశ్నిస్తే....ఓయీ...... నేను నిన్ను ప్రేమతో ఆదరించి ... ముగ్దమనోహర కౌగిలిలో చోటిచ్చాను... అయినా నీవు నన్ను ప్రేమించకపోగా ..నా స్వేచ్చను హరించే ప్రయత్నంలోనే ప్రతీ క్షణం పోరాటానికి సిద్దమవుతుంటే... ప్రేమ లేనిచోట ఈ జీవితానికి మాత్రం చోటేది...

నిజమే కదా... డబ్బుని ప్రేమిస్తాం, పనిని ప్రేమిస్తాం , మన శత్రువుని కూడా ప్రేమిస్తాం ద్వేషంతోనైనా ...కాని తనపై తనకు మాత్రం ఇష్టం, ప్రేమ, ఆదరణ, ఆత్మగౌరం మాత్రం సూన్యం ఐనపుడు... మనిషి తనని తను ప్రేమించలేడు... తమపై ఇష్టం లేనివారికి .... ప్రేమ అనే పదానికి అర్ధం ఎలా తెలుస్తుంది... తనపై ప్రేమ లేనివానికి.. జీవితం పై ఆరాధన ఎలా ఉంటుంది.. అటువంటి చోట  అరచేతిలో జీవితం ఎలా జీవిస్తుంది....

26, ఆగస్టు 2013, సోమవారం

ఆడపిల్ల - ఆర్దికస్వతంత్రం - రాచబాటేనా....నాణేనికి మరోవైపు....

1. ఆడపిల్లలదే భవిష్యత్తు అనాలో... అగమ్యగోచరం అయ్యే ఆడపిల్ల భవిష్యత్తు అనాలో తెలియడం లేదు, ఇపుడు ప్రతి ఒక్కరు ఉద్యోగం చేయకున్నా, ఇంట్లో ఉంటూ చిన్న వ్యాపారాలు, ట్యూ షన్స్ చెప్పేవాళ్ళు ఉన్నారు, చదువుకున్న ప్రతి అమ్మాయి సంపాదనా మార్గాలు ఎంచుకుంటున్నది. ఏదో వేడినీళ్ళకు చల్లనీళ్ళుగా మా సంపాదన ఉంటుందిగా అని ప్రతి ఇంట్లో వినిపించే మాట...

అమ్మాయిలకు ఇంతకూ ముందు చదువుకునే వనరులు లేక మాత్రమే చదవలేదు.. ఇపుడు కావలసిన వనరులు, చదువుకు పెట్టుబడి పెట్టడానికి తల్లితండ్రులు వెనుకాడడం లేదు. అమ్మాయి చదువుకుంటే, ఆమెను చేసుకోడానికి అంతకంటే పై అంతస్థువాడు వస్తాడని, తమ స్థాయి కంటే రెండు స్థాయిల పైన ఉంటుందన్న ఆశ ఒక కారణం . అమ్మాయిలకు చదువు ప్రతి ఇంట్లో సెకండ్ ప్రేఫెరెన్సు, చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుంటే, తన కంటే పై స్థాయి వాడిని వివాహం చేసుకునే అర్హత వస్తుందని, లేదంటే కాస్తా కట్నం ఎక్కువ ఇచ్చి అలాంటి వాడిని తల్లి తండ్రులు తెస్తారని ప్రతి అమ్మాయి అనుకోవడం వల్ల తను చదువుపై ఆందోళన చెందడంలేదు, తనకు బ్రతుకు భయం లేదు, తన బ్రెయిన్ ప్రశాంతంగా ఉంది, అందుకే తను కొద్ది సమయం చదువుకు పెట్టినా కూడా ఉన్నత స్థానానికి వెళ్ళగలుగుతుంది.

ఎందుకు ఆడపిల్లల్లో డబ్బు సంపాదనపై ఆశక్తి పెరిగింది, భర్త సంపాదన అందరిది, కాని భార్య సంపాదన ఆమె సొంతం, తను కొంతమేర ఇంట్లోకి వాడవచ్చు, మిగిలినది తన అభిరుచికి అనుగుణంగా వాడుకునే స్వతంత్రం ఉండడమే ముఖ్య కారణం. అందుకే ఈ తరం వాళ్ళకు పిల్లలను పెంచడంలో కన్నా తమ కెరీర్ అభివృద్ధికే ఎక్కువ సమయం పెట్టడానికి ఇష్టపడుతున్నారు. పిల్లలను వద్దనుకునేవారికి వివాహా బంధం కూడా ఆకర్షించదు కదా!
'స్త్రీ ఎపుడైతే వివాహ బంధం, మాతృత్వం అనేవి సంకెళ్ళుగా తలచి, ఆ బంధం నుండి వైతోలగి ఏ రంగంలో నైన నైపుణ్యం కనపర్చడం మొదలెడితే ఆమెను జయించడం ఎవరితరం కాదు' యిలా ఒకప్పుడు ఓషో చెపితే అందరు తప్పు పట్టారు. కాని ఇపుడు జరిగే పరిణామం చూస్తుంటే నిజమని ఒప్పుకోవాలేమో, ఇలానే కొన్ని సంవత్సరాలు కొనసాగితే, పిల్లలు కని ఇచ్చే స్త్రీకి అతి ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చే రోజుకూడా వస్తుందేమో.

2. పిల్లలను పిల్లలుగా చూస్తె తప్పు లేదు కాని ఇపుడు అమ్మాయికి చూపినంత శ్రద్ద మగపిల్లవాడిపై చూపకపోవడం గుర్తించాల్సిన విషయం, అమ్మాయికి ఏదైనా తెలియదు అంటే తెలుసుకొని చెప్పే తల్లితండ్రులు, అబ్బాయి విషయానికి వచ్చేసరికి ఆ మాత్రం నువ్వు తెలుసుకోలేవా అని అంటున్నారు. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే అందులో అబ్బాయి అమ్మాయికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనే ఒత్తిడికి గురిచేస్తున్నారు. జీవితంలో ఉన్నతమైన ఉద్యోగం సంపాదించడాన్ని జీవిత గమ్యంగా నిర్దేసిస్తున్నారు, ఇలాంటి ఒత్తిడి అబ్బాయిలల్లో తెలియకుండానే, ఆత్మనూన్యతకు గురిచేయడమే కాకుండా తను అధికుడనని, బలవంతుడనని, కావలసింది అందుకునే మొండివాడిని అని నిరూపించుకోడానికి, నలుగురి దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడు. అందులో కొందరు ఎంచుకున్నదే ప్రేమించడం, ప్రేమ అందలేదని దాడులు చేయడం...

పురుషుడు తన సంపాదనా విభాగంలో సేవకుడిగా ఉన్నా, ఇంట్లో మహారాజుగా సేవలు అందుకునేవాడు ఒకప్పుడు, ఇపుడు ఆ పరిస్థితులు తరిగిపోయాయి....అబ్బాయిలు అందుకున్న ఆశయం...వాళ్ళకు తగినంత గుర్తింపు ఇవ్వడం లేదు,అమ్మాయి అందుకుంటే అపురూపం, అబ్బాయి అందుకుంటే సాధారణంగా పరిగణించడం వల్ల అమ్మాయిని పోటిదారుగా, శత్రువుగా భావిస్తున్నాడు. నీవు ప్రతీది సాధించగలవు అని కాక, నీవు తప్పని సరిగా చేయాలి, సంపాదనపరుడు కాకపొతే జీవించే అర్హత లేనట్టుగా, ఒత్తిడికి గురిచేయడం అనేది పెద్దలు, సమాజం చేస్తున్న పొరపాటు.

6, ఆగస్టు 2013, మంగళవారం

మరచివలేని కథ....మరపురాని కథ..

పిల్లల్లో పెద్దల్లో యుద్ధం అంటే విముఖత కలిగించే కథ ఇది. యుద్ధంలో సైనికాధిపతులు, పెద్ద పెద్ద నాయకులు చనిపోరు. షిన్ వంటి మూడు సంవత్సరాల అమాయక బాలలు చనిపోతారు. హీరోషీమాపై అణుబాంబు వేసినప్పుడు షిన్ తన మూడు చక్రాల సైకిల్ తొక్కుతున్నాడు.యుద్ధం యొక్క విధ్వంసకతను ఎల్లప్పుడు గుర్తు చేసే కథ ఇది.

పూర్తి కథ కోసం: "షిన్ మూడు చక్రాల సైకిల్" (shin's Tricycle - tatsuharu kadarma) "

8, జులై 2013, సోమవారం

వెనుక బెంచి అమ్మాయి...

మొదటి రోజు క్లాసు లోకి అడుగు పెట్టగానే తన చూపు ఆఖరి బెంచి లో కూర్చున్న ఇద్దరి అమ్మాయిల మీద పడింది. ఆ క్లాసులో మొత్తం 20అమ్మాయిలు 12 మంది అబ్బాయిలు ఉండగా, ఆఖరి బెంచిలో కూర్చున్న అమ్మాయిలకి మిగతావారికి మద్య ఒక బెంచి ఖాళీగా ఉండడం వింతగా అనిపించింది. నాలుగు రోజులు గడిచాక నేను ఆఖరి బెంచి అమ్మాయిని ఆ రోజు చెప్పిన పాఠంలో నుండి ఒక ప్రశ్న అడగగానే, ఆ అమ్మాయి జవాబు కంటే ముందే క్లాస్ అంతా గొల్లున నవ్వులతో మ్రోగింది. ఉలిక్కి పడిన నేను, ఆ అమ్మాయి ముఖం చూసా, తనలో ఎటువంటి స్పందనా లేదు, ఒక కఠిన శిలలా నిల్చుంది,అప్పటినుండి తను నాకు ఒక శేష ప్రశ్నే అయ్యింది. click here వెనుక బెంచి అమ్మాయి...